కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తులతో శివాలయాలు కిటకిటలాడాయి. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలోని వేయి స్థంభాల ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా తెల్లవారు జాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయం ముందు నంది విగ్రహం వద్ద మహిళలు దీపాలు వెలిగించారు.
కార్తికం: వేయి స్తంభాల ఆలయంలో భక్తి పారవశ్యం - వేయి స్తంభాల ఆలయంలో కార్తిక పూజలు
కార్తిక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. వేయి స్తంభాల ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. రుద్రేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు.
కార్తికం: వేయి స్తంభాల ఆలయంలో భక్తి పారవశ్యం
అనంతరం రుద్రేశ్వరుణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయం కిటకిటలాడింది.
ఇదీ చదవండి:పుష్కరఘాట్లో మహిళను కాపాడిన పోలీసులు