కార్తిక మాసం సందర్భంగా వరంగల్ జిల్లా హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారు జాము నుంచే ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం ముందు ఉన్న నంది విగ్రహం వద్ద మహిళలు దీపాలు వెలిగించి భక్తి భావాన్ని చాటారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణాలన్నీ కిటకిటలాడాయి.
1000 స్తంభాల ఆలయానికి పోటెత్తిన భక్తులు - కార్తిక మాస వేడుకలు
కార్తిక సోమవారం పురస్కరించుకుని వేయి స్తంభాల ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
1000 స్తంభాల ఆలయానికి పోటెత్తిన భక్తులు