ఓరుగల్లు వేయిస్తంభాల ఆలయం కార్తిక శోభను సంతరించుకుంది. కార్తిక సోమవారం కావడం వల్ల తెల్లవారుజామునే భక్తులు ఆలయానికి చేరుకున్నారు. కార్తిక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
వేయి స్తంభాల గుడిలో రుద్రేశ్వరునికి కార్తిక పూజలు.. - karthika puja at thousand pillar temple
ఓరుగల్లు వేయి స్తంభాల ఆలయం కార్తిక దీపాలతో కళకళలాడింది. కార్తిక సోమవారం కావడం వల్ల ఉదయాన్నే భక్తులతో ఆలయం కిటకిటలాడింది. రుద్రేశ్వరుణికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రుద్రేశ్వరునికి కార్తిక పూజలు..
మహిళలు వెలిగించిన దీపాల వెలుగుల్లో ఆలయం ముందున్న నందీశ్వరుడు తేజోమయంగా కనువిందు చేశాడు. రుద్రేశ్వరుణికి ఆలయ అర్చకులు అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే పోటెత్తిన భక్తులతో వేయి స్తంభాల కోవెల కిటకిటలాడింది.
- ఇదీ చదవండి :నాల్గో రోజు వైభవంగా తుంగభద్ర పుష్కరాలు