వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తిక మాసం నాలుగో సోమవారం సందర్భంగా తెల్లవారు జామునుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
వేయిస్తంభాల ఆలయంలో భక్తుల సందడి - వరంగల్ అర్బన్ లేటెస్ట్ న్యూస్
కార్తిక మాసం నాలుగో సోమవారాన్ని పురస్కరించుకొని వేయి స్తంభాల ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. వేకువ జాము నుంచే భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అనంతరం దీపాలు వెలిగిస్తున్నారు.
వేయి స్తంభాల ఆలయంలో భక్తుల సందడి
ఆలయం ముందు నంది విగ్రహం వద్ద మహిళలు దీపాలు వెలిగిస్తున్నారు. అనంతరం రుద్రేశ్వరుణ్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇదీ చదవండి:తుళ్లూరులో ఉద్రిక్తత: రాళ్లదాడిని నిరసిస్తూ చలిలోనే మహిళల ఆందోళన