thousand pillar temple news: వేయి స్తంభాల ఆలయంలో కార్తిక మాసోత్సవాలు - తెలంగాణ వార్తలు
10:25 November 05
వేయి స్తంభాల ఆలయంలో కార్తిక మాసోత్సవాలు ప్రారంభం
హనుమకొండ వేయి స్తంభాల ఆలయంలో(thousand pillar temple news) కార్తిక మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దత్త విజయానంద తీర్థ స్వామి జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి... ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయం ముందు నంది విగ్రహం వద్ద మహిళలు దీపాలు వెలిగించి భక్తి భావాన్ని చాటుకున్నారు. రుద్రేశ్వరుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు . భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయం కిటకిటలాడింది.
ఇదీ చదవండి:Karthika masam 2021: కార్తీక మాసం విశిష్టత ఏమిటి? ఏం చేయాలి?