ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం భద్రకాళి అమ్మవారి దేవాలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు నిరాడంబరంగా సాగుతున్నాయి. అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భద్రకాళి ఆలయంలో ఏకాంతంగా కల్యాణ బ్రహ్మోత్సవాలు - భద్రకాళి అమ్మవారి దేవాలయం
వరంగల్ అర్బన్ జిల్లాలోని శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరుగుతున్నాయి. కరోనా ఉద్ధృతి దృష్ట్యా భక్తులు లేకుండా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
Kalyana Brahmotsavalu, Bhadrakali Temple, warangal
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఉత్సవాలను ఏకాంతంగా జరుపుతున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఆగమశాస్త్ర సామ్రాట్ శేషు తెలిపారు. అమ్మవారిని రెండో రోజు జింక వాహనంపై ఊరేగించనున్నారు.
ఇదీ చూడండి: 'తొమ్మిదేళ్లుగా విధుల్లో భార్యకు బదులు భర్త'.. కలెక్టర్కు ఫిర్యాదు