తెలంగాణ

telangana

ETV Bharat / state

Khaloji Notification: ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ - ఎంఎస్సీ నర్సింగ్

ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నేటి నుంచి రేపు సాయంత్రం 6 గంటల వరకు మెరిట్ జాబితాలో అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని వెల్లడించింది.

Khaloji Notification
ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌

By

Published : Mar 27, 2022, 5:39 AM IST

ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఇవాళ్టి నుంచి మొదటివిడత వెబ్‌కౌన్సిలింగ్‌ జరగనుంది. ఈ మేరకు కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.

విశ్వవిద్యాలయ పరిధిలోని ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి రేపు సాయంత్రం 6 గంటల వరకు మెరిట్ జాబితాలో అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. మెరిట్ జాబితా, సీట్ల వివరాలను కాళోజి వర్శిటీలో వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
ఇదీ చూడండి:

రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ .. రికార్డు స్థాయికి యూనిట్‌ ధర

ABOUT THE AUTHOR

...view details