వరంగల్ కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఎంపీహెచ్) కోర్సులో ఈ ఏడాది ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఈనెల 21వ తేదీ ఉదయం 10 గంటల నుంచి నవంబర్ 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
కాళోజీ వర్సిటీ ఎంపీహెచ్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
ఈ విద్యాసంవత్సరానికి మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కోర్సులో ప్రవేశాలకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 21వ తేదీ నుంచి నవంబర్ 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
కాళోజీ వర్సిటీ ఎంపీహెచ్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
వచ్చేనెల 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.30 వరకు ప్రవేశ పరీక్ష ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తామని వెల్లడించింది. అభ్యర్థులు గంటన్నర ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్సైట్ www.knruhs.telangana.gov.inలో చూడవచ్చని తెలిపింది.