కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాకు చెందిన కవి, కథారచయిత రమా చంద్రమౌళిని నారాయణరావు పురస్కారానికి ఎంపిక చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెద ముద్ర వేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం ప్రభుత్వ ప్రజాకవి నారాయణరావు పేరుతో ప్రతిష్ఠాత్మకంగా అవార్డులు అందజేస్తూ కవులను, కథా రచయితలను, మేధావులను, సాహితీవేత్తలను గౌరవిస్తోంది.
రామా చంద్రమౌళికి కాళోజీ నారాయణరావు పురస్కారం - rama chandramouli wins kaloji narayanrao award
రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ నారాయణరావు పురస్కారానికి వరంగల్ జిల్లాకు చెందిన కవి, కథా రచయిత రామా చంద్రమౌళిని ఎంపిక చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అవార్డు గ్రహీతకు ఆమోద ముద్ర తెలుపగా.. ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చంద్రమౌళిని అభినందించారు.
కాళోజీ నారాయణరావు పురస్కారానికి రామా చంద్రమౌళి ఎంపిక
ఈ అవార్డుకు ఎంపికైనా రామా చంద్రమౌళి.. వరంగల్ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైరయ్యారు. కవిగా, కథా రచయితగా, నవలాకారుడిగా ప్రసిద్ధికెక్కారు. చంద్రమౌళి కవితా సంకలనాలలో 'దీపశిఖ', 'స్మృతిధార', 'అంతర్దహనం', 'అంతర', 'అసంపూర్ణ' వంటి ప్రముఖ రచనలు. కాళోజీ నారాయణరావు అవార్డుకు ఎంపికైన రామా చంద్రమౌళికి రాష్ట్ర ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు.
ఇదీ చూడండి:పీవీకి భారతరత్న తీర్మానం సమయంలో సభలో స్వల్ప సంవాదం