తెలంగాణ

telangana

ETV Bharat / state

ధ్రువపత్రాల పరిశీలనకు కాళోజీ  వర్సిటీ నోటిఫికేషన్​

కాళోజీ హెల్త్​ యూనివర్సిటీలో పలు కోర్సులకు దరఖాస్తులు చేసుకున్న విద్యార్థుల జాబితాను అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ధ్రువప్రత్రాల పరిశీలనకు సంబంధించిన తేదీలను ప్రకటించారు.

kaloji narayana rao health university notification for certification Examination
ధ్రువపత్రాల పరిశీలనకు కాళోజీ ఆరోగ్య యూనివర్సిటీ నోటిఫికేషన్​

By

Published : Jan 30, 2021, 3:56 AM IST

కాళోజీ నారాయణ రావు హెల్త్​ యూనివర్సిటీ పరిధిలో బీపీటీ, ఎంఎల్​టీ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితాను వర్సిటీ అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఈ మేరకు ధ్రువపత్రాల పరిశీలనకు నోటిఫికేషన్​ను జారీ చేశారు.

ఈ నెల 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 6 వరకు బీఎస్సీ నర్సింగ్, 7, 8 తేదీలలో పోస్ట్​ బేసిక్ బీఎస్సీ నర్సింగ్​ అభ్యర్థులకు ఉస్మానియా క్యాంపస్​లోని ప్రో. జి. రాం రెడ్డి దూరవిద్యా కేంద్రంలో ధ్రువ పత్రాలను పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు. జేఎన్​టీయూలో ఫిబ్రవరి 1 - 3 వరకు బీపీటీ, 4 - 6 వరకు బీఎస్సీ (ఎంఎల్టీ) కోర్సులకు సంబంధించిన ధ్రువపత్రాలను పరిశీలిస్తామని పేర్కొన్నారు. అన్ని కోర్సుల్లోని దివ్యాంగ అభ్యర్థులకు ఫిబ్రవరి 6న మెడికల్ బోర్డ్ ఆధ్వర్యంలో ఎవాల్యూషన్ జరుగుతుందని వర్సిటీ అధికారులు వెల్లడించారు. మరిన్ని వివరాలకు www.knruhs.telangana.gov.in ను సంప్రదించాలని కోరారు.

ఇదీ చదవండి:జగత్​ విఖ్యాత్​ రెడ్డి బెయిల్ పిటిషన్​పై తీర్పు రేపటికి వాయిదా

ABOUT THE AUTHOR

...view details