తెలంగాణ

telangana

By

Published : Oct 22, 2022, 10:04 PM IST

ETV Bharat / state

పీజీ మెడికల్ ప్రవేశాలకు నీట్ అర్హత మార్కుల తగ్గింపు.. మరోసారి దరఖాస్తులకు ఆహ్వానం

Kaloji medical university notifications: పీజీ మెడికల్ నీట్ కటాఫ్‌ తగ్గడంతో కన్వీనర్, యాజమాన్య కోటాలో సీట్ల భర్తీకి కాళోజి ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం దరఖాస్తులకు మరోసారి ప్రకటన విడుదల చేసింది. కన్వీనర్ కోటా సీట్లకు రేపటి నుంచి 26 వరకు గడువు పెట్టింది. యాజమాన్య కోటా సీట్లకు ఈ నెల 24 నుంచి 27 వరకు గడువు ఇచ్చారు. ఈ మేరకు ఒక ప్రకటనను అధికారులు విడుదల చేశారు.

Kaloji medical university PG Medical Admissions notification
పీజీ మెడికల్​ ప్రవేశాలు

NEET Eligibility Marks Reduction Center for PG Medical Admissions: పీజీ మెడికల్ నీట్ కటాఫ్ స్కోర్ తగ్గడంతో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కాళోజి ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం తెలిపింది . ఈ మేరకు విశ్వవిద్యాలయం పీజీ మెడికల్ కన్వీనర్‌ అదే విధంగా యాజమాన్య కోటా సీట్ల దరఖాస్తుకు మరో ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నీట్‌ 2022 పీజీ అర్హత కటాఫ్‌ స్కోరును 25 పర్సెంటైల్‌ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఫలితంగా జనరల్‌ అభ్యర్థులు 25 పర్సెంటైల్‌ 201 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కి 15 పర్సెంటైల్‌ 169 మార్కులు, దివ్యాంగులకు 20 పర్సెంటైల్‌ 186 మార్కులు సాధించిన వారు అర్హత సాధించారు. కటాఫ్‌ మార్కులు తగ్గించడంతో అర్హత పొందిన అభ్యర్థులు కన్వీనర్ కోటా సీట్లకు రేపు‍‍(ఈ నెల 23వ తేదీ) ఉదయం 8 గంటల నుండి నుండి 26వ తేదీ సాయింత్రం 5 గంటల వరకు అదే విధంగా యాజమాన్య కోటా సీట్లకు ఈ నెల 24వ తేదీ ఉదయం 8 గంటల నుండి 27వ తేదీ సాయింత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. మరింత సమాచారానికి యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.in ను చూడాలని యూనివర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details