Kaloji University: ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ను కాళోజి వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. మార్చి 12వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 14వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. అభ్యర్థులు ఒకే సారి అన్ని కళాశాలలకు ప్రాధాన్యతా క్రమంలో ఆప్షన్లను నమోదు చేయాల్సి ఉంటుంది.
Kaloji University: కాళోజీ వర్సిటీ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్
Kaloji University: తెలంగాణలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. యాజమాన్య కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Kaloji University: కాళోజీ వర్సిటీ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్
ఈ విడతతో పాటు మిగిలిన విడత కౌన్సిలింగ్లకు ఈ ఆప్షన్ల ఆధారంగానే సీటు కేటాయింపులు జరుగుతాయి. అభ్యర్థులు ఇది గమనించి అన్ని కళాశాలలకు ప్రాధాన్యతా క్రమంలో తప్పనిసరిగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని... మరిన్ని వివరాలకు వెబ్సైట్ చూడాలని, యూనివర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇదీ చదవండి: