కరోనా ఉద్ధృతి దృష్ట్యా మే 5 నుంచి జరగాల్సిన పీజీ వైద్య పరీక్షలను వాయిదా కోరుతూ జూనియర్ వైద్యులు... కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీకి మెయిల్ ద్వారా విన్నవించారు. రెండో దశలో వైరస్ విజృంభిస్తోందని...పెద్ద సంఖ్యలో వైద్య విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారని లేఖలో తెలిపారు.
'పీజీ వైద్య పరీక్షలను వాయిదా వేయండి' - Kaloji university exams updates
కాళోజీ విశ్వవిద్యాలయంలో మే 5 నుంచి జరగాల్సిన పీజీ వైద్య పరీక్షలు వాయిదా వేయాలని కోరతూ జూనియర్ వైద్యులు వీసీకి విన్నవించారు. వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని కోరారు.
kaloji
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పరీక్షలకు హాజరైతే... మరింత ఎక్కువ మందికి వైరస్ సోకే అవకాశముందని పేర్కొంటూ పరీక్షలు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.
Last Updated : Apr 27, 2021, 2:16 PM IST