Kaloji jayanthi Celebrations Telangana 2023: కాళోజీ ఒక వ్యక్తి కాదు... మహాశక్తి. తెలంగాణ వైతాళికుడు. ప్రజల పక్షంవహించిన ప్రజాకవి, రచయిత, ఉద్యమకారుడు. అన్యాయాన్ని ఎదురించిన నిత్య చైతన్య శీలి. జీవితమే ఉద్యమంగా ఉద్యమమే ఊపిరిగా బతికిన మహామనిషి. రాజీ ఎరుగనితత్వం కాళోజీ సొంతం. అధిపత్యాన్ని ప్రశ్నించిన స్వభావం కాళన్నది. నిరంతరం వ్యవస్ధతో గొడవపడం ఆయన నైజం. మాండలికానికి పట్టం కట్టిన మహనీయుడు. అందుకే నేటి తరానికి ఆయన జీవితం... స్ఫూర్తిదాయకం.
Kaloji jayanthi Telangana 2023: పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ చేసిన సేవలను ఆయన స్మరించుకున్నారు. మన భాషకు అస్తిత్వ స్పృహను పెంచడంలో కాళోజీది కీలకపాత్ర అని కొనియాడారు. కాళోజి స్ఫూర్తి, తెలంగాణ సాధనలో, ప్రగతిలో ఇమిడి ఉందన్నారు. తెలంగాణ భాషా సాహిత్య రంగాల్లో కృషిచేస్తున్న కవులు రచయితలను గుర్తించి వారికి కాళోజి పేరున ప్రతి యేటా పురస్కారాలను అందిస్తూ ప్రభుత్వం గౌరవించుకుంటున్నదని సీఎం పేర్కొన్నారు. ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే కాళోజీ పురస్కారాన్ని ఈ సంవత్సరానికి గాను అందుకుంటున్న, ప్రముఖ కవి జయరాజుకు కేసీఆర్ మరోసారి అభినందనలు తెలిపారు.
CM KCR on Kaloji jayanthi 2023 : మనషి మనిషిగా బతకలేని దౌర్భాగ్య పరిస్ధితి ఎదురైనప్పుడు అన్యాయం అవినీతి, అమానుషత్వం, దౌర్జన్యం విలయతాండవం చేసినప్పుడు.. కాళోజీ మండే సూర్యుడైయ్యాడు. ప్రతి చిన్న సంఘటనకు.. ఘర్షణకు కాళోజీ హృదయం స్పందించింది. కంఠం గద్గదమై.. కన్నీళ్లు నిండిన కళ్లతో ఆవేదన పెల్లుబికి.. అక్షరరూపం ధరించి.. మాహా కావ్యాలైయ్యాయి.
అవనిపై జరిగేటి అవకతవకలు చూచి..
ఎందుకో నా హృదిని ఇన్ని వేదనలు..
పరుల కష్టం చూసి కరిగిపోవను గుండె..
మాయ మోసము చూసి మండిపోవను ఒళ్లు..
అంటూ సమాజంలోని పరిస్ధితులు కల్గించిన ఆవేదనతో.. నాగొడవ గీతాలు రాశారు.. కాళోజీ.
అన్యాయాన్ని ఎదురిస్తే.. నా గొడవకు సంతృప్తి..
అన్యాయం అంతరిస్తే.. నా గొడవకు ముక్తిప్రాప్తి
అన్యాయాన్ని ఎదరించిన వాడే నాకు ఆరాధ్యుడంటూ..
ప్రశ్నించేవారు...అన్యాయాన్ని ఎదిరించేవారుంటే.. సమాజం కొంతవరకైనా బాగుపడుతుందని తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వెల్లడించారు కాళోజీ.
కాళోజీకి ఒక ప్రాంతమన్నది లేదు. దేశం మంతా పర్యటించారు. వేలాది సమావేశాల్లో ఉపాన్యాసాలు.. కవితాగానం చేశారు.
కులముతో పనిలేదు.. గుణము తోడను లేదు..
అందచందాలతో ఆవశ్యకము లేదు..
వయసుతో పనిలేదు.. వరుస తోడను లేదు
కలిమిలేములు రెండు కలసి సయ్యాటలాడు
మానవత్వము మెరుగు, మర్త్యలోకపు వెలుగు.. అంటూ విశ్వమానవతా సందేశం వినిపించారు.
కాళోజీ భాషకు పట్టం కట్టారు. తన హృదయానికి నచ్చని, జనహితానికి సరపడనిది దేన్నైనా.. తీవ్రమైన పదాలతో.. దనుమాడే తత్వం కాళోజీది. తెలుగు మాట్లాడటం నామోషీగా భావించే వాళ్లకు