kaloji university : రాష్ట్రంలో పీజీ వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. పీజీ వైద్య విద్య సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. విశ్వవిద్యాలయ పరిధిలోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. నీట్-2022లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ.. ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.
పీజీ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ - Warangal Urban District Latest News
kaloji university రాష్ట్రంలో పీజీ వైద్య విద్య సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. విశ్వవిద్యాలయ పరిధిలోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తుతో పాటు సంబంధిత ధృవీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను విదుదల చేస్తారు. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను చూడాలని అధికారులు సూచించారు.