కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో మార్చి 17న మూతపడిన వరంగల్ కాకతీయ జంతు ప్రదర్శన శాల ఆరు నెలల తర్వాత శుక్రవారం రోజున తెరుచుకుంది. కరోనా వ్యాప్తి దృష్ట్యా.. పార్కుకు వచ్చిన సందర్శకులను ప్రవేశ ద్వారం వద్దే శానిటైజ్ చేసి లోపలికి పంపిస్తున్నారు.
ఆరు నెలల తర్వాత తెరుచుకున్న కాకతీయ జంతు ప్రదర్శనశాల
ఆరు నెలల తర్వాత వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని కాకతీయ జంతు ప్రదర్శనశాల శుక్రవారం రోజున తెరుచుకుంది. మొదటిరోజు కావడం వల్ల చాలా తక్కువ సందర్శకులు వచ్చారని డీఎఫ్ఓ రామలింగం తెలిపారు.
కాకతీయ జంతు ప్రదర్శనశాల
జూ పార్క్‌లో ఎక్కడా కరోనా నిబంధనల ఉల్లంఘన జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని వరంగల్ డీఎఫ్ఓ రామలింగం తెలిపారు. మాస్కులు ధరించిన వారినే లోపలికి అనుమతిస్తున్నామని వెల్లడించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఒత్తిడికి లోనవుతున్న ప్రజలంతా.. జూపార్క్‌కు వచ్చి కాసేపు సేదతీరాలని కోరారు. మొదటి రోజు కావడం వల్ల చాలా తక్కువ సందర్శకులు వచ్చారని చెప్పారు.