వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం లైబ్రరీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. లైబ్రరీ ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. లైబ్రరీలో సరైన వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అకాడమిక్ పుస్తకాలు లేవని వాపోయారు. తాగునీరు, కుర్చీలు, ఇతర మౌళిక వసతులు సరిగా లేవన్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకున్న నాథుడే లేరన్నారు.
కేయూ లైబ్రరీ ఎదుట విద్యార్థుల ఆందోళన - students andholana
కాకతీయ విశ్వవిద్యాలయంలోని లైబ్రరీలో మౌళిక వసతులు సరిగా లేవంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్న పట్టించుకోవట్లేదని ఆందోళన చేశారు.
![కేయూ లైబ్రరీ ఎదుట విద్యార్థుల ఆందోళన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4189869-365-4189869-1566302591378.jpg)
కేయూ లైబ్రరీ ఎదుట విద్యార్థుల ఆందోళన
TAGGED:
students andholana