వలస కూలీలను ఆదుకుని దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో వలస కూలీలకు అన్నదానం చేశారు. వలస కూలీలకు 12 కిలోల చొప్పున బియ్యం, 500 రూపాయల నగదును అందించారు.
'వలస కూలీలను ఆదుకోవటంలో తెలంగాణ నెంబర్ వన్' - FOOD DISTRIBUTION
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో వలస కూలీలకు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నిత్యావసరాలు అందించారు. వలస కూలీలను ఆదుకోవటంలో తెలంగాణే నెంబర్ వన్ అని వెల్లడించారు.
'వలస కూలీలను ఆదుకోవటంలో తెలంగాణ నెంబర్ వన్'
వలస కూలీలను యజమానులే ఆదుకోవాలని... లేకుంటే కఠిన చర్యలు తప్పవని కడియం హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అండగా నిలుస్తుందన్నారు. విపత్కర సమయంలో దాతలు ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలని కోరారు.