కరోనా కట్టడికి ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు చేస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కొనియాడారు. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్లోని ఆశాకార్యకర్తలు, ఏఎన్ఎంలకు కడియం నిత్యావసర సరుకులు అందించారు.
'ఆశాకార్యకర్తలు, ఏఎన్ఎంల సేవలు అభినందనీయం' - corona update
వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్లోని ఆశాకార్యకర్తలు, ఏఎన్ఎంలకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి నిత్యావసర సరుకులు అందించారు. కరోనాను కట్టడి చేయటంలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంల పాత్ర అభినందనీయమని కొనియాడారు.

'ఆశాకార్యకర్తలు, ఏఎన్ఎంల సేవలు అభినందనీయం'
క్షేత్ర స్థాయిలో పనిచేస్తూ... వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించి సత్వరమే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించేలా ఆశా కార్యకర్తలు కృషి చేస్తున్నారని వివరించారు. వైరస్ ఒకరి నుంచి మరోకరి వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ... సూచనలు అందిస్తున్నారని కొనియాడారు.