తెలంగాణ

telangana

ETV Bharat / state

KA Pal fire on TRS: నేనెవరో మీకు తెలియదా.. అయితే గూగుల్​లో వెతకండి: కేఏ పాల్ - కేఏ పాల్ వార్నింగ్

KA Pal fire on TRS: తన సభకు అనుమతి ఇవ్వకుండా రాహుల్ గాంధీకి ఎలా ఇచ్చారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు. తనను తెలంగాణకు రాకుండా చేయాలని కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి మరింత దోచుకునేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.

KA Pal fire on TRS
కేఏ పాల్

By

Published : Apr 30, 2022, 9:19 PM IST

KA Pal fire on TRS: రైతుల కోసం ఉద్యమం చేస్తానని భయపడి తమ సభకు అనుమతి ఇవ్వలేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. రాహుల్ గాంధీకి ఓటు బ్యాంకు లేదని తెలిసి అనుమతి ఇచ్చారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కంటే ముందే ఏప్రిల్ 22న సభకు అనుమతి కావాలని దరఖాస్తు చేశానని తెలిపారు. వరంగల్ సీపీ తరుణ్​ జోషిని కలిసిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో ఎంత దౌర్జన్యం జరుగుతుందనడానికి ఇదే నిదర్శనం. మే 6న రైతు సభ పెడతామంటే కేటీఆర్ ఫోన్ చేసి కేఏ పాల్ ఎవరో తెలియదని చెప్తారా? రాహుల్ గాంధీ సభకు అనుమతి ఇవ్వడమేంటీ? నేనెవరో కమిషనర్​కు తెలియదా? మీకు చదువొస్తే గూగుల్​లో కేఏ పాల్ అని కొట్టి నేర్చుకోండి. ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయండి. గవర్నర్​కు కూడా ప్రోటోకాల్ ఇవ్వట్లేదు. ఎనిమిదేళ్లు భాజపాకు మద్దతిచ్చిన కేసీఆర్.. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి ఇప్పుడు మోదీ మీకు చెడు అయ్యాడా? బంగారు తెలంగాణను అప్పులపాలు చేసిన కేసీఆర్ సమాధానం చెప్పాలి? తెలంగాణను ఇంకా దోచుకోవడానికి ఇదంతా చేస్తున్నారా?

- కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు

బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్.. కనీసం వెండిగా కూడా మార్చలేకపోయాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. తెలంగాణలో రైతులు, నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మే 6న హనుమకొండ అర్ట్స్ కళాశాల మైదానంలో సభకు అనుమతి ఇవ్వాలని లేకుంటే కోర్టుకు వెళ్తానని కేఏ పాల్ హెచ్చరించారు.

నేనెవరో మీకు తెలియదా.. అయితే గూగుల్​లో వెతకండి: కేఏ పాల్

ఇవీ చూడండి:యాదాద్రి కొండపైకి వాహనాల అనుమతి.. కాకపోతే పార్కింగ్ ఫీజు రూ. 500!

సెక్యూరిటీ గార్డును చెట్టుకు వేలాడదీసి.. ఇనుప రాడ్లతో దాడి!

ప్రారంభం రోజే పట్టాలు తప్పిన రైలు.. మంత్రికి తప్పిన ప్రమాదం!

ABOUT THE AUTHOR

...view details