వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. నిమిషం నిబంధన ఉండటంతో విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషన్... మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు రెండో సెషన్ పరీక్ష జరగనుంది. 6రోజుల పాటు జరిగే పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
హన్మకొండలో జేఈఈ పరీక్ష ప్రారంభం - హన్మకొండలో జేఈఈ పరీక్షలు
వరంగల్ అర్బన్ జిల్లాలో జేఈఈ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. నిమిషం నిబంధన ఉండటంతో విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. కొవిడ్ దృష్ట్యా పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మాస్కులు, భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
![హన్మకొండలో జేఈఈ పరీక్ష ప్రారంభం JEE EXAMS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8634079-48-8634079-1598932604184.jpg)
JEE EXAMS
వరంగల్, హన్మకొండ, నర్సంపేటలో 6 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 7,183 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కొవిడ్ నేపథ్యంలో విద్యార్థులకు మాస్కులను అందించి లోపలికి పంపించారు. జ్వరం, తదితర సమస్యలు ఉన్నవారికి ప్రత్యేక గదులు కేటాయించారు.