తెలంగాణ

telangana

ETV Bharat / state

'ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ సేవల విస్తరణ' - projects in warangal

రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఈ ఏడాది నుంచే ఐటీ పరిశ్రమలను విస్తరించేలా కార్యాచరణ సిద్ధం చేసినట్టు ఐటీ మంత్రి కేటీఆర్ తెలిపారు. వరంగల్‌లో సైయెంట్‌, టెక్‌ మహీంద్రా నూతన ప్రాంగణాలను మంత్రి ప్రారంభించారు. విమానాశ్రయాన్ని వినియోగంలోకి తెచ్చే వరకు... హైదరాబాద్‌కు ఓరుగల్లుకి మధ్య హెలిపోర్ట్ సేవలు విస్తరిస్తామని కేటీఆర్‌ తెలిపారు.

it minister ktr starts two projects in warangal
'ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ సేవల విస్తరణ'

By

Published : Jan 8, 2020, 5:26 AM IST

చారిత్రక నగరం ఓరుగల్లు ఐటీ ప్రయాణంలో... కీలక అడుగు పడింది. మడికొండ ప్రత్యేక ఆర్థిక మండలిలో సైయంట్, టెక్ మహీంద్ర నూతన ప్రాంగణాలను తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ రెండు సంస్థల ద్వారా కనీసం పదివేలమందికైనా ఉపాధి లభించాలని ఆకాంక్షించారు. టెక్ మహీంద్రా సీఈఓ గుర్నానీతో కలిసి... కేటీఆర్ టెక్ మహీంద్రా ప్రాంగణాన్ని ప్రారంభించారు. అనంతరం అత్యాధునిక హంగులతో 5 ఎకరాల్లో ఏర్పాటుచేసిన సైయెంట్ ప్రాంగణాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

మరో ఏడాదిలో తెలంగాణలోని అన్ని జిల్లాల్లోకి ఐటీని విస్తరిస్తామన్న కేటీఆర్... హైదరాబాద్‌ తర్వాత.. వరంగల్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఈ రెండు నగరాల మధ్య ఎన్నో పరిశ్రమలు రానున్నాయన్నారు. ఉప్పల్‌ స్కైవే పూర్తైతే... గంటన్నరలోనే హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ చేరుకోవచ్చన్న మంత్రి వరంగల్‌-మామునూరు విమానాశ్రయం పునరుద్ధరిస్తామని చెప్పారు. వరంగల్‌, హైదరాబాద్‌ మధ్య... హెలిపోర్టు సేవలు ప్రారంభిస్తామని తెలిపారు.

'ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ సేవల విస్తరణ'


వరంగల్ సహా రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీని మరింత విస్తరిస్తామని సైయెంట్ వ్యవస్థాపక ఛైర్మన్ బీవీ మోహన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో లక్షా 73 వేల కోట్ల విలువైన పెట్టుబడులతో మొత్తం 12 వేల పరిశ్రమలు ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాయని కేటీఆర్ చెప్పారు.

ఇవీ చూడండి: 'ముఖ్యమంత్రి కేసీఆర్​ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారు'

ABOUT THE AUTHOR

...view details