తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR Chit Chat with KITS Students : 'ఉద్యోగాల కోసం వెంపర్లాడకండి.. ఉద్యోగాలు సృష్టించండి' - కిట్స్​లో ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభించిన కేటీఆర్

KTR Chit Chat with KITS Students : తమ అనుభవాల నుంచే ఎన్నో ఆవిష్కరణలు సృష్టించవచ్చునని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అవసరాలే ఆవిష్కరణలకు ప్రాణం పోస్తాయన్న ఆయన.. ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా ఉద్యోగాలు సృష్టించాలని సూచించారు. హనుమకొండ కిట్స్ కళాశాలలో ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభించిన మంత్రి.. అనంతరం కళాశాల విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు.

KTR
KTR

By

Published : May 5, 2023, 6:37 PM IST

KTR Chit Chat with KITS Students : హనుమకొండ ఎర్రగట్టు గుట్టలోని కిట్స్‌ కళాశాలలో ఇంక్యుబేషన్‌ సెంటర్‌ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం కిట్స్ కళాశాల విద్యార్థులతో మంత్రి కేటీఆర్ ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ విద్యార్థులకు పలు కీలక సూచనలు చేశారు. దేశం అభివృద్ధి చెందాలంటే.. సమూల మార్పులు రావాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉద్యోగాల కోసం వెంపర్లాడొద్దని.. ఉద్యోగాలు సృష్టించాలని కిట్స్ విద్యార్థులకు సూచించారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంత విద్యార్థులు చిన్న చిన్న నూతన పరికరాలను సృష్టిస్తూ ప్రశంసలు పొందుతున్నారని వివరించారు.

'ప్రపంచంలో జపాన్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశం. జపాన్‌లో అణుబాంబు విస్ఫోటనం జరిగినా అభివృద్ధి చెందుతోంది. భారతదేశంలో కొన్ని అవలక్షణాలు ఉన్నాయి. దేశం అభివృద్ధి చెందాలంటే.. సమూల మార్పులు రావాలి. ఉద్యోగాల కోసం వెంపర్లాడకండి. ఉద్యోగాలు సృష్టించండి. చదువు పూర్తయ్యాక నాలుగైదేళ్లు పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు యత్నించండి. మీరు ఎదిగేందుకు టీ హబ్‌, వీ హబ్‌ వంటి ఎన్నో సంస్థలు ఏర్పాటు చేశాం. మన అనుభవాల నుంచి ఎన్నో ఆవిష్కరణలు చేయొచ్చు. అవసరాలే ఆవిష్కరణలకు ప్రాణం పోస్తాయి.'-కేటీఆర్, ఐటీ శాఖ మంత్రి

ఉద్యోగాల కోసం వెంపర్లాడకండి.. ఉద్యోగాలు సృష్టించండి: కేటీఆర్

కేటీఆర్​కు ఘన స్వాగతం పలికిన నాయకులు : అంతకుముందు హుస్నాబాద్‌ పర్యటన ముగించుకుని హెలికాప్టర్‌లో హనుమకొండకు వచ్చిన కేటీఆర్​కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్ భాస్కర్ ఘన స్వాగతం పలికారు. విద్యార్థులతో ముఖాముఖి అనంతరం హనుమకొండ జిల్లా బీఆర్​ఎస్ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వరంగల్‌ జిల్లా కార్యాలయానికి భూమిపూజ నిర్వహించారు. అలాగే రూ.181 కోట్ల నిధులతో నిర్మించనున్న పలు అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఖాజీపేటలోని బహిరంగ సభకు హాజరై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు.

మంత్రి పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు :ఇదిలా ఉండగా.. వరంగల్‌ జిల్లా బీఆర్​ఎస్ పార్టీ కార్యాలయం కోసం రంగశాయిపేటలోని పుల్లాయికుంటను అధికార పార్టీ నేతలు చదును చేయటం వివాదాస్పదంగా మారింది. హనుమకొండలోనూ బాలసముద్రం పార్క్‌ స్థలంలో బీఆర్ఎస్ కార్యాలయం నిర్మించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మంత్రి కేటీఆర్ హనుమకొండ పర్యటన నేపథ్యంలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details