చారిత్రక నగరం ఓరుగల్లులో హైటెక్స్(Warangal HITEX) నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. మడికొండ సమీపంలోని ఐటీ పార్క్ వద్ద త్రీస్టార్ హోటల్(Three Star Hotel), కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు టీఎస్ఐఐసీ(TSIIC)కి అనుమతిస్తూ ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Warangal: అభివృద్ధిలో దూసుకుపోతూ.. హైటెక్స్ నిర్మాణానికి వేగంగా అడుగులు వేస్తూ - త్రీస్టార్ హోటల్
హైదరాబాద్‌లోని హైటెక్స్(Hyderabad HITEX) తరహాలో వరంగల్‌ను తీర్చిదిద్దే దిశగా యంత్రాంగం అడుగులు వేస్తోంది. మడికొండ సమీపంలోని ఐటీ పార్క్ వద్ద త్రీస్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు టీఎస్ఐఐసీ(TSIIC)కి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Warangal: అభివృద్ధిలో దూసుకుపోతూ.. హైటెక్స్ నిర్మాణానికి వేగంగా అడుగులు వేస్తూ
హైటెక్స్ ఏర్పాటు కానుండటంపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ తరహాలో... వరంగల్ కూడా అభివృద్ధి చెందాలన్నా ప్రజల కల నెరవేరుతోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR), మంత్రి కేటీఆర్(KTR)లకు వరంగల్‌పై ఉన్న ప్రత్యేక అభిమానానికి... ఇదే నిదర్శనమన్నారు.
ఇదీ చూడండి:హైదరాబాద్‌లో మే నెలలో కాలుష్యం అత్యల్పం!