Paddy Procurement Scam in Warangal : ధాన్యం కొనుగోలు అక్రమాలకు సంబంధించి వరంగల్ కమిషనరేట్ పరిధిలో తాజాగా మరో వ్యవహారం వెలుగు చూసింది. రూ. 1.05 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు తేలడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 2020-21 ఖరీఫ్‌లో హనుమకొండ జిల్లా పలివేల్పులలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ద్వారా 5,572 క్వింటాళ్ల ధాన్యం సేకరించినట్లు నిర్వాహకులు లెక్క చూపారు. 40 మంది రైతుల నుంచి కొన్నట్లు ట్రక్ చీటీలు సృష్టించారు. ఆ ధాన్యాన్ని పైడిపల్లిలోని వజ్రకవచ మిల్‌టెక్ రైస్ ఇండస్ట్రీస్‌కు తరలించినట్లు నమోదు చేశారు. ప్రభుత్వం నుంచి రూ.1.05 కోట్లు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. దీనిపై పౌరసరఫరాల కార్పొరేషన్‌కు ఫిర్యాదు అందడంతో అంతర్గతంగా విచారణ జరిపింది. 40 మంది రైతుల జాబితాలో ఇద్దరే అసలైన రైతులని తేలింది. మిగిలిన 38 మంది సాగు చేయకున్నా వారిని రైతుల జాబితాలో చేర్చినట్లు వెల్లడైంది.
కౌలు రైతుల పేరిట బోగస్ రికార్డులు