తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా కట్టడికి అన్ని చర్యలూ తీసుకున్నాం' - వరంగల్​లో కరోనా కట్టడి చర్యలపై వైద్యాధికారితో ముఖాముఖి

దిల్లీలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొని జిల్లాకు వచ్చిని వారిపై ప్రత్యేక నిఘా పెట్టామని వరంగల్​ అర్బన్​ జిల్లా వైద్యాధికారిణి లలితాదేవి అన్నారు. ఇప్పటికి మొత్తం 25 మందిని ఎంజీఎంలో ఐసోలేషన్​లో ఉంచగా ఒకరికి వైరస్​ నిర్ధరణ అయిందని... మిగిలిన వారి వివరాలు రావాల్సి ఉందని వెల్లడించారు.

warangal urban district health officer lalithadevi
జిల్లా వైద్యాధికారిణి లలితాదేవి ఇంటర్వ్యూ

By

Published : Apr 1, 2020, 4:31 PM IST

కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్యాధికారిణి లలితాదేవి తెలిపారు. వరంగల్​ అర్బన్​ జిల్లాలో కరోనా బాధితుల కోసం పున్నమి అతిథి గృహం, కాకతీయ మెడికల్‌ కళాశాల, హరిత కాకతీయ, కేయూ బాలబాలికల వసతి గృహాల్లో క్వారంటైన్​ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సామాజిక దూరం పాటిస్తూ...స్వీయ నియంత్రణలో ఉంటేనే కరోనాను సమూలంగా కట్టడి చేయగలమంటున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి లలితాదేవి, సర్వైలెన్స్ అధికారి కృష్ణారావుతో మా ప్రతినిధి ముఖాముఖి.

జిల్లా వైద్యాధికారిణి లలితాదేవి ఇంటర్వ్యూ

ABOUT THE AUTHOR

...view details