కరోనా మృతదేహాల దహనసంస్కారాలకు అడుగడునా అడ్డంకులు ఏర్పడుతున్న తరుణంలో గ్రేటర్ వరంగల్ అధికారులు... ఇందుకోసం 12 మందితో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మృతులను తరలించేందుకు... ప్రత్యేకంగా అంబులెన్స్‌ను సిద్ధం చేశారు.
దహనం లేదా ఖననం మొదట్నుంచి చివరి వరకూ.... బృందం సభ్యులు పర్యవేక్షిస్తారు. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి... వారి వారి మతాచారాలకు అనుగుణంగానే కొవిడ్ మృతులకు అంత్యక్రియలు నిర్వహిస్తామని గ్రేటర్ వరంగల్ కమిషనర్ పమేలా సత్పతి చెప్పారు.