వ్యాపార సముదాయాల్లోని దుకాణాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
రాజస్థాన్‌కు చెందిన హుస్సేన్ కటాత్... చెన్నైలోని ఓ ఎలక్ట్రికల్ దుకాణంలో కొంతకాలం పనిచేశాడు. చెడు వ్యసనాలకు సంపాదించిన డబ్బు సరిపోకపోవడం వల్ల... మరో ఇద్దరితో కలిసి ముఠాగా ఏర్పడి దుకాణాల్లో చోరీలకు పాల్పడడం మొదలుపెట్టాడు.
ఈ సంవత్సరం మార్చి నుంచి ఇప్పటిదాకా హుస్సేన్ 14 చోరీలకు పాల్పడ్డాడు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనూ ఐదు దుకాణాల్లో దొంగతనాలు చేశాడు. నిన్న ఎల్లమ్మబజార్ ప్రాంతంలో... మరో చోరీకి రెక్కీ నిర్వహిస్తుండగా పోలీసులకు చిక్కాడు. అరెస్ట్ చేసిన నిందితుడి నుంచి అరకిలో బంగారం, 2 లక్షల 70 వేల నగదు, ల్యాప్ టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.
వరంగల్‌తో పాటు ఏపీలోనూ రెండు కేసులకు సంబంధించి చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ రవీందర్ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన పోలీసులను సీపీ అభినందించారు.
చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగ అరెస్టు ఇదీ చూడండి: 'నా పేరు మధ్యప్రదేశ్.. నా కొడుకు పేరు భోపాల్'