వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో క్రికెట్ క్రీడాకారుడు హనుమ విహారి వివాహం ఘనంగా జరిగింది. పారిశ్రామికవేత్త రాజేందర్ రెడ్డి కుమార్తె, ప్రముఖ డిజైనర్ ప్రీతిరాజ్ని ఆయన పెళ్లి చేసుకున్నారు. విహారి హైదరాబాద్ నుంచి రంజీ,అంతర్జాతీయ స్థాయిలో ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారుడిగా రాణించి ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. వరంగల్లో అన్ని సౌకర్యాలు ఉన్నందునే అక్కడ ఏర్పాటు చేశామని ఆయన బంధువులు తెలిపారు.
ఇంటివాడైన క్రికెటర్ విహారి - CRICKETER VIHARI
ఓరుగల్లులో క్రికెటర్ హనుమ విహారి వివాహం వైభవంగా జరిగింది. పారిశ్రామికవేత్త కుమార్తె ప్రీతిరాజ్ మెడలో మూడుముళ్లు వేశారు.
కన్నుల పండువగా క్రికెటర్ హనుమ విహారి వివాహం