గత కొద్ది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరంగల్ నగరవ్యాప్తంగా చెరువులు, వాగులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో నగర పాలక సంస్థ మేయర్ గుండా ప్రకాష్ పర్యటించారు. వర్షాల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని మేయర్ హామీ ఇచ్చారు.
వరంగల్‌లో వరదనీటి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మేయర్ - వరంగల్‌లో వరదనీటి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మేయర్
వరంగల్ జిల్లాలో ఆగకుండా కురుస్తున్న వానల వల్ల చెరువులు, కుంటలు నిండి లోతట్టు ప్రాంతాల్లోకి పొంగి పొర్లతున్నాయి. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో మేయర్ గుండా ప్రకాష్ పర్యటించి.. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.

వరంగల్‌లో వరదనీటి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మేయర్
భారీ వర్షాల కారణంగా వరంగల్‌కు తీరని నష్టం వాటిల్లిందని గుండా ప్రకాష్ పేర్కొన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే ప్రజలందరూ సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన తెలిపారు. వరదలతో సర్వం కోల్పోయిన వారికి నగరపాలక సంస్థ బాసటగా నిలుస్తుందని మేయర్ హామీ ఇచ్చారు.