కేయూలో ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ 82వ సమావేశాలు Indian History Congress Sessions In Kakatiya University : ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సమావేశాలు రెండోసారి వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో (Kakatiya University), కేయూ చరిత్ర, టూరిజం విభాగం నేతృత్వంలో జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు చరిత్రను ఒడిసి పట్టిన ఎంతో మంది పరిశోధకులు, ఆచార్యులు, యువ విద్యార్థులు హాజరయ్యారు.
చరిత్రలో నిలిచిపోయేలా 'కాకతీయ వైభవ సప్తాహం' వేడుకలు
ఈ సదస్సులో విదేశాల నుంచి ప్రతినిధులుగా, ఉజ్బెకిస్థాన్ నుంచి మహమ్మూద్ అహ్మద్, అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి రీతూ కందూరితో పాటు దేశ, విదేశాల నుంచి ప్రముఖ చరిత్రకారులు, సామాజిక వేత్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. మొదటిరోజు దేశ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పీజీ కళాశాలల అధ్యాపకులు వారు చేసిన అధ్యయనాలపై పరిశోధన పత్రాలను సమర్పించారు. చరిత్రలో వస్తున్న మార్పులపై వారు చేసిన పరిశోధనలపై, చరిత్ర విషయ నిపుణులు, ఆచార్యులు, విద్యార్థులు విస్తృతంగా చర్చిస్తున్నారు.
ఆనాటి బ్రిటీష్ పాలకులు భారత దేశానికి చరిత్ర, సంస్కృతి లేదని అనే అభిప్రాయాన్ని మనపైన వేయడం జరిగింది. వాటిని దృష్టిలో పెట్టుకొని ఆనాటి చరిత్రకారులు పాశ్చాత్య విద్యతో వచ్చినటువంటి మేధావి వర్గం మన భారతదేశానికి ఉన్నటువంటి గొప్ప చరిత్రను సంస్కృతిని 1935 సంవత్సరంలో పూణెలో మొట్టమొదటి సారిగా ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ను నిర్వహించడం జరిగింది. చరిత్రను తెలుసుకుని అనేక రకాలైన పరిశోధనలు చేసి దేశానికి అందివ్వడమే ఇండియన్ హిస్టరీ లక్ష్యం. - ఆచార్యులు
Warangal KU Bandh Today : పీహెచ్‌డీ ప్రవేశాల రగడ.. నేడు కేయూ సహా వరంగల్ జిల్లా బంద్
Indian History Congress to be held at Kakatiya University:కాకతీయ విశ్వవిద్యాలయంలో 1993లో మొదటిసారిగా 53వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సమావేశాలు (Indian History Congress Sessions) జరిగాయి. రెండోసారి కేయూ ఆడిటోరియం వేదికగా 1300 మంది ప్రతినిధులతో సమావేశాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనలు అకట్టుకున్నాయి. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌కు గొప్ప ప్రాధాన్యత ఉందని చారిత్రక నేపథ్యం గల ఓరుగల్లులో జరగడం తెలంగాణ రాష్ట్రానికి వన్నె తెచ్చే అంశంగా భావిస్తున్నామని ప్రొఫెసర్లు అంటున్నారు.
చరిత్రను తెలుసుకుని అనేక రకాలైన పరిశోధనలు చేసి దేశానికి అందివ్వడమే ఇండియన్ హిస్టరీ లక్ష్యమని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆచార్యులు విద్యార్థులు అనేక ప్రాంతాలు తిరిగి ఆయా అంశాలపై పరిశోధనలు జరిపి ఈ సమావేశాల్లో పెట్టడం ద్వారా కొత్త విషయాలు సమాజానికి తెలుస్తాయని చెబుతున్నారు. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సమావేశాలు నూతన రీసెర్చ్ స్కాలర్‌లకు ఎంతో ఉపయోగపడతాయని యువ పరిశోధకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చరిత్ర అధ్యయనం, పరిశోధనకు ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తే మరిన్ని పరిశోధనలు జరుగుతాయని ఆచార్యులు, పరిశోధకులు, స్పష్టం చేస్తున్నారు.
ప్రజాపాలనకు దరఖాస్తుల వెల్లువ- రెండోరోజు 8,12,862 అప్లికేషన్లు
కొత్త ఏడాది కొంగొత్త నిర్ణయాలు - నూతన లక్ష్యాలతో ముందుకు వెళ్తామంటున్న యువత