తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి వినూత్న ప్రచారం - telangana news

ఎలా ప్రచారం చేస్తేనేం..? చేరాల్సిన లక్ష్యం మాత్రం ఓటర్లే కదా..! అందుకే పొద్దున్నే నడకకు వెళ్లేవారిని కలుస్తూ ప్రచారం సాగిస్తున్నారు.. స్వతంత్ర అభ్యర్థి సూదగాని హరి శంకర్ గౌడ్. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతానని హామి ఇస్తున్నారు.

Hari Shankar Gowd is campaigning by joining the early morning walkers in warangal
స్వతంత్ర అభ్యర్థి.. వినూత్న ప్రచారం

By

Published : Jan 30, 2021, 1:47 PM IST

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాలు వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఊపందుకున్నాయి. వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయం మైదానంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి సూదగాని హరి శంకర్ గౌడ్ వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉదయం నడకకు వచ్చిన వారిని కలుస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీగా గెలిపిస్తే నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతానని హామీ ఇచ్చారు.

ప్రధాన పార్టీ అయిన తెరాస ఎన్నికల సన్నాహక సమావేశాలు పెట్టి ప్రచారం చేస్తుంటే...స్వతంత్ర అభ్యర్థులు చాప కింద నీరులా ప్రచారం చేసేస్తున్నారు. నిరుదద్యోగులను కలుస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.

ఇదీ చూడండి:హింసతో స్వతంత్ర సంగ్రామాన్ని ఉరకలెత్తించారు : సీఎం కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details