ప్రభుత్వ ఉపాధ్యాయులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా హన్మకొండలో జ్యోతిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ప్రధానోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... 70 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతామని హామీనిచ్చారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి - ప్రభుత్వ పాఠశాల
హన్మకొండలో జ్యోతిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ప్రధానోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై ఉపాధ్యాయులను సన్మానించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి