తెలంగాణ

telangana

ETV Bharat / state

అట్టహాసంగా ఐనవోలు మల్లన్న జాతర - telangana varthalu

ఐనవోలులో మల్లన్న జాతర అట్టహాసంగా సాగుతోంది. కోరమీసాల మల్లన్నను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లిస్తున్నారు. శివసత్తుల ఆటపాటలు మల్లన్న నామస్మరణతో ఐనవోలు ఆలయ ప్రాంగణం హోరెత్తింది.

అట్టహాసంగా ఐనవోలు మల్లన్న జాతర
అట్టహాసంగా ఐనవోలు మల్లన్న జాతర

By

Published : Jan 14, 2021, 1:08 PM IST

వరంగల్ పట్టణ జిల్లా ఐనవోలులో మల్లన్న జాతర అట్టహాసంగా జరుగుతోంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లన్న నామస్మరణతో ఐనవోలు ఆలయ ప్రాంగణం మార్మోగింది.

కోరమీసాల మల్లన్నను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. బోనాలతో మొక్కులు చెల్లిస్తున్నారు. జాతర ఏర్పాట్లపై భక్తులు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. స్నానాల గదులు ఏర్పాటు చేయలేదని తెలిపారు.

అట్టహాసంగా ఐనవోలు మల్లన్న జాతర

ఇదీ చదవండి: సంస్కృతి సంతకం... సంక్రాంతి!

ABOUT THE AUTHOR

...view details