తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓరుగల్లులో 5వ బెటాలియన్​ పరిపాలనా భవనం ప్రారంభం - Telangana State Battalion Additional DGP Abhilash Bist latest news

ఓరుగల్లు జిల్లాలో 5వ బెటాలియన్ పరిపాలనా భవనాన్ని తెలంగాణ రాష్ట్ర బెటాలియన్ అడిషనల్ డీజీపీ అభిలాష బిస్త్ ప్రారంభించారు. టీఎస్​ఎస్పీ సిబ్బంది సేవలు అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు.

Opening of the 5th Battalion Administration Building at Warangal Urban District
ఓరుగల్లులో 5వ బెటాలియన్​ పరిపాలనా భవనం ప్రారంభం

By

Published : Jan 12, 2021, 1:23 PM IST

కరోనా మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కొనడమే కాకుండా రాష్ట్ర అంతర్గత భద్రత, ప్రజల సంక్షేమానికి టీఎస్​ఎస్పీ సిబ్బంది అందిస్తున్న సేవలు అందరికి ఆదర్శమని తెలంగాణ రాష్ట్ర బెటాలియన్ అడిషనల్ డీజీపీ అభిలాష బిస్త్ అన్నారు.

వరంగల్ అర్బన్ జిల్లా మామునూరులోని టీఎస్​ఎస్పీ నాలుగో బెటాలియన్ ప్రాంగణంలోని 5వ బెటాలియన్​కు కేటాయించిన పరిపాలనా భవనాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం ఐదో బెటాలియన్ కమాండెంట్ ఛటర్జీ, నాలుగో బెటాలియన్​ ఇన్​ఛార్జ్ కమాండెంట్ వెంకటయ్య, వరంగల్ పోలీస్​ కమిషనర్​ ప్రమోద్​కుమార్​తో కలిసి మొక్కలు నాటారు.

ఈ భవనం మరో పదిహేను ఏళ్ల వరకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఛటర్జీ పేర్కొన్నారు. రెండేళ్లలోపు అన్నిరకాల సౌకర్యాలతో బెటాలియన్ సిద్ధమవుతోందని తెలిపారు. అప్పటి వరకు వరంగల్ నుంచే బెటాలియన్ సేవలు అందనున్నాయని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details