లాక్‌డౌన్ దృష్ట్యా.. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ చౌరస్తా నిర్మానుష్యంగా మారింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 10 గంటల తర్వాత వ్యాపారులు.. దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. ఏసీపీ రవీంద్ర కుమార్ పట్టణంలో లాక్‌డౌన్ పరిస్థితిని పరిశీలించారు. సిబ్బందికి తగు సూచనలు చేశారు.
నిర్మానుష్యంగా మారిన కాజీపేట్ చౌరస్తా - వరంగల్ అర్బన్ జిల్లా లాక్‌డౌన్
వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్‌లో.. ఉదయం 10 గంటల నుంచి లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఉదయాన్నే ప్రజలు అధిక సంఖ్యలో బయటకు వచ్చి నిత్యావసరాలను కొనుగోలు చేసి తిరిగి వెళ్లిపోయారు. ఏసీపీ రవీంద్ర కుమార్ పట్టణంలో లాక్‌డౌన్ పరిస్థితిని పరిశీలించారు.
lockdown in kazipet
పోలీసులు.. కట్టుదిట్టంగా నిబంధనలను అమలు చేస్తున్నారు. పది రోజుల పాటు ప్రజలు రోడ్డుపైకి రాకుండా అవగాహన కల్పిస్తున్నారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా మద్యం దుకాణాలు