సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు విశేషంగా ఆకట్టుకుంది. హన్మకొండలోని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మి కాంతారావు నివాసంలో మూడు రోజుల పాటు బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ప్రతి సంక్రాంతి సందర్భంగా లక్ష్మీ కాంతారావు సతీమణి సరోజినీదేవి పండుగ విశిష్టతను తెలియజేసేలా బొమ్మల కొలువుని నిర్వహిస్తారు.
హన్మకొండలో ఆకట్టుకుంటున్న బొమ్మల కొలువు
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు విశేషంగా ఆకట్టుకుంది. బొమ్మల ద్వారా రుక్మిణీ దేవి కల్యాణంను కళ్ళకు కట్టినట్లు చూపెట్టారు. ఈ కొలువును చూడటానికి నగరవాసులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు.
హన్మకొండలో ఆకట్టుకుంటున్న బొమ్మల కొలువు
ముక్కోటి దేవతలను ఒక్కచోట చేర్చి ఆయా దేవతల విశేషాలు, పురాణ హితిహాసాలు భావితరాలకు అందించేందుకు ఈ బొమ్మల కొలువు దోహదం చేస్తుందని సరోజినీదేవి తెలిపారు. బొమ్మల ద్వారా రుక్మిణీ దేవి కల్యాణంను కళ్ళకు కట్టినట్లు చూపెట్టారు. ఈ బొమ్మల కొలువును చూడటానికి నగరవాసులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు.
ఇదీ చదవండి:కాఫీలు తాగారా.. టిఫినీలు చేశారా..!