పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 31 మంది విద్యార్థులకు అస్వస్థత - ts news
పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 31 మంది విద్యార్థులకు అస్వస్థత
14:32 February 26
శ్రీరాములపల్లిలో విద్యార్థులకు అస్వస్థత
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శ్రీరాములపల్లిలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శ్రీరాములపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన అనంతరం 31 మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలు కాగా.. వారిని కమలాపూర్ పీహెచ్సీకి తరలించారు. కలుషిత ఆహారం కారణంగానే ఇలా జరిగినట్లు వైద్యులు వెల్లడించారు. పలువురు విద్యార్థులు బలహీనంగా ఉన్నారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
Last Updated : Feb 26, 2022, 3:05 PM IST
TAGGED:
విద్యార్థులకు అస్వస్థత