హైదరాబాద్ నుంచి జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌కి కారులో నిషేధిత గుట్కా బ్యాగులను తరలిస్తుండగా వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్టేషన్ ఘనపూర్‌కు చెందిన గణేష్ అనే వ్యక్తి 6 బ్యాగుల్లో గుట్కాలు, 10 బాక్సుల జర్దా ప్యాకెట్లను కారులో తరలిస్తున్నాడన్న పక్కా సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు నందీరామ్ నాయక్, మధు తమ సిబ్బందితో రాఘవపూర్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు.
గుట్కా పట్టివేత... వ్యక్తి అరెస్టు, కారు స్వాధీనం - వరంగల్ జిల్లాలో నిషేధిత గుట్కా స్వాధీనం
హైదరాబాద్ నుంచి స్టేషన్ ఘనపూర్‌కి కారులో తరలిస్తున్న నిషేధిత గుట్కా బ్యాగులను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సుమారు రూ. 2 లక్షల 71 వేలు విలువ చేసే గుట్కా ప్లాకెట్లను, ఓ కారును స్వాధీనం చేసుకుని.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ టూ స్టేషన్‌ఘన్‌పూర్‌కు గుట్కా ప్యాకెట్లు అక్రమ రవాణా
ఈ క్రమంలో అటుగా వస్తున్న గణేశ్ పట్టుబడగా.. గుట్కా ప్యాకెట్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లింగంపల్లికి చెందిన కె.కె బజాజ్ అనే వ్యక్తి నుంచి పెద్ద మొత్తంలో ఈ నిషేదిత పదార్థాలను కొనుగోలు చేసి.. చిన్న చిన్న మొత్తాలలో అమ్మేందుకు తీసుకుని వెళ్తున్నట్లు నిందితుడు పోలీసుల దగ్గర ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తు చేపడుతున్నారు.
ఇవీ చూడండి:వ్యవసాయ శాఖ క్రియాశీలకంగా మారాలి: సీఎం
TAGGED:
warangal latest news