ప్రశాంతంగా ప్రారంభమైన ఐసెట్ పరీక్ష - icet
ఎంబీఎ, ఎంసీఎ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష ఐసెట్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఎగ్జామ్ జరగనుంది.
ఐసెట్ పరీక్ష
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో రెండో రోజు ఐసెట్ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఈ పరీక్ష జరగనుంది. హన్మకొండలో 8 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 1549 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. నిన్న జరిగిన పరీక్షకు 1435 మంది హాజరయ్యారు.