తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐసెట్​, పీజీ ఈసెట్​ నోటిఫికేషన్లు​ విడుదల..

ICET, PGECET 2022 Notification: టీఎస్​ ఐసెట్​, పీజీ ఈసెట్​ నోటిఫికేషన్లు​ విడుదలయ్యాయి. ఏప్రిల్​ 6 నుంచి జూన్​ 27 వరకు ఐసెట్​, ఏప్రిల్​ 12 నుంచి జూన్​ 22 వరకు పీజీ ఈసెట్​ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. జులైలో పరీక్షలు నిర్వహించనున్నారు.

TSICET 2022 Notification
TSICET 2022 Notification

By

Published : Mar 30, 2022, 7:24 PM IST

ICET 2022 Notification 2022- 23: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం 2022- 23 ఐసెట్ నోటిఫికేషన్​ను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబ్రాది, వరంగల్‌ కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి రమేష్ విడుదల చేశారు. వరంగల్‌ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఐసెట్ నోటిపికేషన్​ను విడుదల చేశారు. మొత్తం 14 రీజినల్ సెంటర్లు ఏర్పాటు చేశామని ఛైర్మన్​ లింబాద్రి తెలిపారు.

ఏప్రిల్​ 6 నుంచి.. జూన్​ 27 వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. రూ.1000 అపరాధ రుసుముతో జులై 23 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. జులై 27, 28 రెండు రోజుల పాటు పరీక్ష నిర్వహిస్తామని ఛైర్మన్​ తెలిపారు. పరీక్ష ఫలితాలను ఆగస్టు 22న విడుదల చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఐసెట్​ కన్వీనర్​ రాజిరెడ్డి పాల్గొన్నారు.

PGECET Notification 2022- 23: అదేవిధంగా ఎంటెక్​, ఎంఫార్మసీలో ప్రవేశాల కోసం పీజీ ఈసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 12 నుంచి జూన్ 22 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగనుంది. ఆలస్య రుసుంతో జులై 10 వరకు ఈసెట్‌ దరఖాస్తులు స్వీకరిస్తారు. జులై 29 నుంచి ఆగస్టు 1 వరకు పరీక్షల నిర్వహణ జరగనుంది.

ఇదీ చదవండి:Jeevan Lite: ఐఐటీ హైదరాబాద్​ పరిశోధకుల ఏడాదిన్నర కృషి ఫలితం.. "జీవన్​ లైట్​"

ABOUT THE AUTHOR

...view details