2014లో ప్రధానిగా చాయ్‌వాలా వస్తున్నాడంటే అందరితో పాటు తాను ఎంతో సంతోషించానని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పదవి చేపట్టిన తర్వాత మోదీ ప్రజలకు అన్యాయం చేశారని విమర్శించారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో మంత్రి ఈటల, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ రోడ్‌షో నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
'చాయ్‌వాలా ప్రధానంటే నేనూ సంతోషించా'
రాష్ట్రానికి అధిక నిధులు, ప్రాజెక్టులు సాధించుకోవాలంటే 16 మంది తెరాస ఎంపీలను గెలిపించాలని మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా ముల్కనూర్‌లో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్, ఎమ్మెల్యే సతీశ్‌తో కలిసి రోడ్‌షోలో పాల్గొన్నారు.
'ప్రధానిగా చాయ్‌వాలా వస్తున్నారంటే నేనూ సంతోషించా'
రానున్న ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే సత్తా చాటనున్నాయని కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి వినోద్ అభిప్రాయపడ్డారు. కేంద్రంలో తెరాస కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం కృషిచేస్తున్నానని మరో అవకాశం ఇవ్వాలని వినోద్ ఓటర్లను కోరారు.16 మంది తెరాస ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రానికి మరింత మేలు జరుగుతుందని నేతలు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:పాక్ విమానాల్ని సమర్థంగా తిప్పికొట్టిన భారత్
Last Updated : Apr 2, 2019, 7:23 AM IST