వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతి విధి నిర్వహణలో తన మానవత్వాన్ని చాటుకున్నారు. వరంగల్ పట్టణంలోని నాలాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాల తొలగింపు చర్యలను పరిశీలించడానికి వెళ్తున్న క్రమంలో హన్మకొండలోని తిరుమల బార్ జంక్షన్ వద్ద ఓ మహిళ ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కమిషనర్ వెంటనే కారు ఆపి.. స్వయంగా తన కారులో ఆ మహిళను ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితురాలి కుటుంబీకులకు సమాచారం అందించి ఆమెకు చికిత్స చేయించి వెళ్లారు. విధి నిర్వహణలో ఉండగా.. రోడ్డు మీద జరిగిన ప్రమాదం పట్ల స్పందించి మానవత్వాన్ని ప్రదర్శించిన కమిషనర్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు.
కిందపడ్డ మహిళను ఆస్పత్రికి చేర్చిన కమిషనర్! - వరంగల్ మహా నగర పాలక సంస్థ
విధి నిర్వహణకై వెళ్తున్న సమయంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడ్డ మహిళను కారు ఆపి ఆస్పత్రికి చేర్పించారు వరంగల్ కమిషనర్ పమేలా సత్పతి. వరంగల్ నగరంలోని నాలాలాపై అక్రమ నిర్మాణాల తొలగింపు పరిశీలనకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కిందపడ్డ మహిళను ఆస్పత్రికి చేర్చిన కమిషనర్!