తెలంగాణ

telangana

ETV Bharat / state

మొక్కలు పర్యావరణానికి దోహదపడతాయి - హుస్నాబాద్​ ఎమ్మెల్యే సతీశ్​ కుమార్​

వరంగల్​ అర్బన్​ జిల్లా కొత్తకొండలో హుస్నాబాద్​ ఎమ్మెల్యే హరితహారం, తీజ్​ ఉత్సవాల్లో పాల్గొన్నారు. మొక్కలను నాటడం కాదు వాటిని జాగ్రత్తగా సంరక్షించాలని పేర్కొన్నారు.

మొక్కలు పర్యావరణానికి దోహదపడతాయి

By

Published : Aug 22, 2019, 7:59 PM IST

మొక్కలు పర్యావరణానికి దోహదపడతాయి
వరంగల్ అర్బన్ జిల్లా భీమాదేవరపల్లి మండలం కొత్తకొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో హరితహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హుస్నాబాద్​ ఎమ్మెల్యే సతీశ్​ కుమార్​, జిల్లా జడ్పీ ఛైర్మన్​ సుధీర్​ కుమార్​ పాల్గొని మొక్కలు నాటారు. మొక్కలను నాటడమే కాదు వాటిని సంరక్షించి జాగ్రత్తగా పెంచాలన్నారు. అనంతరం తీజ్​ ఉత్సావాలకు హాజరయ్యారు. గిరిజన యువతులతో గోధుమ నారును ఎత్తుకొని వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details