వరంగల్లోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్లో టెక్నోజీయాన్ వేడుకలు హుషారెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే ప్రయోగాలు, ఎగ్జిబిషన్ల ప్రదర్శనలతో తీరిక లేకుండా విద్యార్థులు గడుపుతున్నారు. రాత్రి సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలతో సేదతీరుతున్నారు.
నిట్లో నృత్య ప్రదర్శనలతో హుషారు - వరంగల్లోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్లో టెక్నోజీయాన్ వేడుకలు
వరంగల్ నిట్లో టెక్నోజియాన్ 2019 వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. ఉత్సవాల్లో భాగంగా సాంకేతిక ప్రదర్శనలు నవంబర్ 3వరకు జరుగనున్నాయి.

నిట్లో నృత్య ప్రదర్శనలతో హుషారు
ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనలో చిందులు వేస్తూ సందడి చేశారు. నిట్ ప్రాంగణం మొత్తం విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. నచ్చిన పాటలకు నృత్యాలు చేస్తూ సహచర మిత్రులతో కేరింతలు కొడుతున్నారు. ఈ వేడుకల్లో సాంకేతిక ప్రదర్శనలు నవంబర్ 3వరకు జరగనున్నాయి.
నిట్లో నృత్య ప్రదర్శనలతో హుషారు
ఇదీ చూడండి : ప్రమాణ పూర్వకంగా తప్పులు చెబుతారా?