ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో భక్తుల తాకిడి పెరిగింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రకాల దారాలతో అందంగా అలంకరించారు. ఏటా రాఖీ పౌర్ణమి నాడు అమ్మవారిని రక్ష దారాలతో అలంకరించడం ఆనవాయితీగా వస్తుందని భక్తులు తెలిపారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
భద్రకాళి అమ్మవారికి రక్ష దారాలతో అలంకరణ - భద్రకాళి అమ్మవారికి రక్ష దారాలతో అలంకరణ
వరంగల్ అర్బన్ జిల్లాలో శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. రాఖీ పౌర్ణిమ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక రక్ష దారాలతో అలంకరించారు.
భద్రకాళి అమ్మవారికి రక్ష దారాలతో అలంకరణ
ఇవీ చూడండి: దొంగలను తరిమికొట్టిన వృద్ధులకు సాహస పురస్కారం