వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మద్యం విక్రయిస్తున్నారు. మాస్కులు ఉన్నవారికి మాత్రమే మద్యం విక్రయించారు. హన్మకొండలోని కిషన్పురా వద్ద మద్యం దుకాణాల ముందు రద్దీ ఎక్కువకావడం వల్ల వారిని పోలీసులు చెదరగొట్టారు. ఎండవేడిని తట్టుకునేందుకు గొడుగులతో కూడిన క్యూలైన్లలో నిలబడి కొంతమంది మద్యాన్ని కొనుగోలు చేశారు. ఉదయం 10 గంటలకు దుకాణాలు తెరవనుండగా 7 గంటల నుంచే మందుబాబులు దుకాణాల ముందు బారులు తీరారు.
మద్యం కోసం రద్దీ... బారులు తీరిన మందుబాబులు - warangal wine shops
వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మద్యం విక్రయాలు కొనసాగతున్నాయి. భౌతిక దూరం పాటించేలా.. దుకాణాల ముందు చర్యలు తీసుకున్నా రద్దీ ఎక్కువవుతోంది. కొన్ని చోట్ల దుకాణాల ముందు మద్యం ప్రియులు గుమిగూడటం కనిపించింది.
మద్యం దుకాణాల ముందు మందుబాబుల రద్దీ
కొన్ని చోట్ల స్టాక్ సరిచూసుకునేందుకు సమయం తీసుకోగా దుకాణాలు ఆలస్యంగా తెరుచుకున్నాయి. దుకాణాలు తెరిచి తెరవగానే కొందరు బ్యాగులతో మందుబాటిళ్లు కొనుగోలు చేసి ఇళ్లకు తీసుకెళ్లారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 255 దుకాణాలు తెరుచుకున్నాయని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సురేష్ రాఠోడ్ వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలుంటాయని కమీషనర్ హెచ్చరించారు.