తెలంగాణ

telangana

By

Published : Dec 11, 2019, 8:15 PM IST

ETV Bharat / state

ఓరుగల్లులో రూ. 900 కోట్ల పెట్టుబడితో భారీ పరిశ్రమ

ఓరుగల్లు జిల్లాలో ప్రపంచ స్థాయి వస్ర్త పరిశ్రమ ఒకటి టెక్స్ టైల్ పార్కులో ఏర్పాటు కానుంది. ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు గతంలో ఒప్పందం చేసుకున్న కొరియా టెక్స్‌టైల్ దిగ్గజం యంగ్వాన్ కార్పొరేషన్ ఈరోజు 900 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. భారీ పెట్టుబడి వచ్చిన సందర్భంగా మంత్రి కె.తారకరామారావు హర్షం వ్యక్తం చేశారు.

huge industry with an investment of Rs 900 crore at warangal
ఓరుగల్లులో రూ. 900 కోట్ల పెట్టుబడితో భారీ పరిశ్రమ

వరంగల్​లో ఓ ప్రపంచ స్థాయి టెక్స్‌టైల్ పరిశ్రమ రూ. 900 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానుంది. వరంగల్ టెక్స్‌టైల్ పార్కులో యూనిట్ స్థాపన కోసం తెలంగాణ ప్రభుత్వంతో కార్పొరేషన్ ఈరోజు తుది ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పరిశ్రమకు అవసరమైన భూ కేటాయింపు పత్రాలను కంపెనీ అందుకుంది. తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, యంగ్వాన్ కార్పొరేషన్ ఛైర్మన్ కిహాక్ సుంగ్ కంపెనీ ప్రతినిధి బృందం, భారత్, కొరియా రాయబారుల సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.

వరంగల్ మెగా టెక్స్‌టైల్ పార్కులో యంగ్వాన్ కార్పొరేషన్ ఒక యూనిట్​గా ఉంటుంది. అందుకోసం 290 ఎకరాల భూమి కేటాయింపు పత్రాలను ప్రభుత్వం అందించింది. స్థానికంగా లభించే అత్యుత్తమ కాటన్ ఉత్పత్తిని ఉపయోగించుకుని ఎగుమతులే లక్ష్యంగా, యంగ్వాన్ వివిధ రకాల టెక్స్‌టైల్ ఉత్పత్తులను తయారు చేయనుంది. ఈ యూనిట్ ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సూమారు 12 వేల మందికి ఉపాధి లభించనున్నదని, యంగ్ వన్ పెట్టుబడి ద్వారా వరంగల్ టెక్స్‌టైల్ పార్కుకి మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు వస్తాయని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి : 'హిందువులకు తెరాస క్షమాపణ చెప్పాలి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details