తెలంగాణ

telangana

ETV Bharat / state

'డ్రైనేజీ నిర్మాణం పేరుతో... ఇళ్లను కూలుస్తున్నారు'

Houses Dismasted: డ్రైనేజీ నిర్మాణం చేస్తామని చెప్పి.. ఇళ్లను కూల్చివేస్తున్నారంటూ బాధితులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన వరంగల్​ జిల్లా వర్ధన్నపేటలో చోటు చేసుకుంది. అప్పులు చేసి కట్టుకున్న ఇళ్లను మున్సిపల్ అధికారులు దగ్గరుండి.. కూల్చివేస్తున్నారని బాధితులు ఆవేదన చెందారు.

hoses dismasted by officials at vardannapet in Hanmakonda
వర్ధన్నపేట పట్టణంలో ఉద్రిక్త వాతావరణం

By

Published : Feb 5, 2022, 11:51 AM IST

వర్ధన్నపేట పట్టణంలో ఉద్రిక్త వాతావరణం

Houses Dismasted: వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డ్రైనేజీ నిర్మాణం పేరుతో అధికారులు ఇళ్లు కూలుస్తున్నారంటూ పట్టణవాసులు ఆందోళనకు దిగారు. అప్పులు చేసి కట్టుకున్న ఇళ్లను అక్రమంగా కూల్చి వేస్తున్నారని కన్నీరు పెట్టుకుని విలపించారు.

మున్సిపల్ అధికారులు, 60 మంది పోలీసుల పహారాలో.. 6 జేసీబీలతో ఇళ్లను తొలగించారు. అధికారులు దగ్గరుండి ఈ దారుణానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 50 ఫీట్లకు నోటీసులు ఇచ్చి, 55 ఫీట్లకు పైగా ఇళ్లు కూలుస్తున్నారంటూ వాపోయారు. అధికారులను బాధితులు అడ్డుకోగా.. పోలీసులు ఆందోళన చేస్తున్నవారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ఇదీ చూడండి:ఒడిశాలో మరో బొగ్గు బ్లాకును సొంతం చేసుకునేందుకు సింగరేణి యత్నం

ABOUT THE AUTHOR

...view details