తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎడతెరిపి లేని వానలు... కూలిపోతున్న ఇళ్లు - భీమదేవరపల్లి మండలం

వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్​లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల ఇళ్లు కూలిపోయాయి. ఫలితంగా కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రభుత్వం వెంటనే పునరావాసం కల్పించాలని బాధితులు కోరుతున్నారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కూలిపోతోన్న ఇళ్లు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కూలిపోతోన్న ఇళ్లు

By

Published : Aug 16, 2020, 6:37 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్​లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల ఇళ్లు కూలిపోయాయి. ఫలితంగా కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బయట పందిరి వేసుకుని ఉంటున్నామని... ఏమైనా కీటకాలు వస్తాయేమోననే భయాందోళనలో ఉన్నామన్నారు.

దుకాణ సముదాయాల్లోకే...

కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా బయట ఎవరూ ఇళ్లు కిరాయిలు ఇవ్వడం లేదని వాపోతున్నారు. అధికారులు తమను వెంటనే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటం వల్ల డ్రైనేజీలు నిండిపోవడంతో ముల్కనూరులోని పలు కాలనీల ఇళ్లు, దుకాణ సముదాయాల్లోకి నీరు చేరింది. ఎల్కతుర్తిలోని కొన్ని లోతట్టు వీధుల్లో... ఇళ్లలోకి దుకాణ సముదాయాల్లోకి వర్షపు నీరు చేరింది. వర్షం ధాటికి కూలిపోయిన ఇళ్లకు ప్రభుత్వం తగిన నష్టపరిహారం ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు.

ఇవీ చూడండి : 'ఉదారవాద ఆలోచన గల మహా నేత వాజ్​పేయీ'

ABOUT THE AUTHOR

...view details